పురుగు మందు తాగి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-18T05:11:19+05:30 IST

పురుగు మందు తాగి, ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు.

పురుగు మందు తాగి ఆత్మహత్య

బాడంగి: పురుగు మందు తాగి, ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. హెచ్‌సీ ఉమామహేశ్వరరావు అందించిన వివరాల ప్రకారం.. గొల్లాది గ్రామానికి చెందిన గిరుడుబల్లి రామారావు(32)కు తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన చిన్నమ్మితో ఎనిమిదేళ్ల కిందట వివాహమయ్యింది. వీరికి పోల మ్మ, శ్రావణి అనే కుమార్తెలు ఉన్నారు. రామారావు మద్యానికి బానిస కావడంతో తరచూ ఇంటిలో గొడవలయ్యేవి. ఈక్రమంలో చిన్నమ్మి దసరా సెలవుల నిమిత్తం పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రామారావు ఆదివా రం పురుగు మందు తాగాడు. బంధువులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించా రు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామారావు సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ తెలిపారు. 

 

Updated Date - 2022-10-18T05:11:19+05:30 IST