విద్యార్థుల సామూహిక సెలవు

ABN , First Publish Date - 2022-03-06T04:59:02+05:30 IST

కురుపాం బీసీ గురుకుల పాఠశాలలో పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన ఘటనతో మిగిలిన విద్యార్థులంతా సామూహికంగా సెలవు పెట్టి ఇళ్లకు వెళ్లిపోయారు. రెండు రోజుల కిందట పాఠశాల వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులను పాము కాటేసిన విషయం విదితమే.

విద్యార్థుల సామూహిక సెలవు
ఇంటికి బయలుదేరిన విద్యార్థులు

పాము కాటు ఘటనపై గురుకుల విద్యార్థుల్లో కలవరం

కురుపాం, మార్చి5: కురుపాం బీసీ గురుకుల పాఠశాలలో పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన ఘటనతో మిగిలిన విద్యార్థులంతా సామూహికంగా సెలవు పెట్టి ఇళ్లకు వెళ్లిపోయారు. రెండు రోజుల కిందట పాఠశాల వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులను పాము కాటేసిన విషయం విదితమే. వారిలో మంతిన రంజిత్‌ మృతి చెందగా మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలకు చెందిన 216 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాము కాటు దుర్ఘటనతో తల్లిదండ్రులంతా శనివారం పాఠశాలకు వచ్చి తమ పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లిపోయారు. శుక్రవారం 172 మంది ఇంటిబాట పట్టగా.. శనివారం మిగతా 44 మంది పిల్లలు మూకుమ్మడిగా సెలవు దరఖాస్తులు అందజేసి వెళ్లిపోయారు. పాఠశాల మొత్తం ఖాళీ అవ్వడంతో గత్యంతరం లేని పరిస్థితిలో సిబ్బంది తరగతి గదులకు తాళం వేశారు. పిల్లల్లో మానసిక స్థైర్యం నింపి తిరిగి పాఠశాలకు రప్పిస్తామని సిబ్బంది తెలిపారు.Read more