రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2022-12-16T23:55:34+05:30 IST

అనంతపురంలో ఈనెల 20, 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్న మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ మహాసభలను విజయవంతం చేయాలని ఫెడరేషన్‌ పాలకొండ అధ్యక్ష, కార్యదర్శులు పి.భాస్కరరావు, సీహెచ్‌ సంజీవి, పి.వేణు కోరారు.

రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

పాలకొండ: అనంతపురంలో ఈనెల 20, 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్న మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ మహాసభలను విజయవంతం చేయాలని ఫెడరేషన్‌ పాలకొండ అధ్యక్ష, కార్యదర్శులు పి.భాస్కరరావు, సీహెచ్‌ సంజీవి, పి.వేణు కోరారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాలను పాలకొండ లో శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రంలో 123 మునిసిపాల్టీల్లో ఉన్న రెండు కోట్ల మంది ప్రజలకు పౌర సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, సభ్యులు విమల, శ్రీదేవి, మధు, రామారావు, సాయి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:55:35+05:30 IST