బస్సు కోసం పాట్లు.. తప్పని ఫీట్లు

ABN , First Publish Date - 2022-12-12T00:05:29+05:30 IST

గ్రామీణ విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. గజపతినగరం నియోజకవర్గంలో తగినన్ని ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఉన్న బస్సుల్లోనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది.

బస్సు కోసం పాట్లు.. తప్పని ఫీట్లు
బస్సు ఎక్కేందుకు అవస్థలు పడుతున్న విద్యార్థులు

గజపతినగరం: గ్రామీణ విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. గజపతినగరం నియోజకవర్గంలో తగినన్ని ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఉన్న బస్సుల్లోనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. బస్సు మెట్ల వద్ద నిలబడుతూ.. ప్రమాద కర స్థితిలో కళాశాలలకు చేరుకోవల్సిన పరిస్థితి. నియోజకవర్గం పరిధి లోగల గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి మండలాలతో పాటు మెంటాడ మండలం నుంచి నిత్యం వందలాది మంది విద్యార్థులు విజయ నగరంలోగల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలకు రాకపోకలు సాగిస్తు న్నారు. గతంలో విజయనగరం ఆండ్ర రూట్‌లో అరగంటకు ఒక పల్లెవెలుగు బస్సు ఉండడంతో ప్రయాణం సుఖాంతంగా జరిగేది. ప్రస్తుతం రెండు గంటలకు ఒక బస్సు రావడంతో ప్రయాణికులతో పాటు విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కొన్నిసార్లు కళాశాల లకు ఆలస్యంగా చేరుకోవాల్సి వస్తుందని పలువురు విద్యార్థులు వాపోతు న్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్‌ పాస్‌లు ఉన్నా ప్రయాణం కష్టతరంగా ఉంటుందని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేసి సకాలంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో పాటు వ్యాపారులు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-12T00:05:31+05:30 IST