జలజీవన్‌ మిషన్‌లో 65 పనుల మంజూరు

ABN , First Publish Date - 2022-11-25T00:05:56+05:30 IST

మండలంలో జలజీవన్‌మిషన్‌లో భాగంగా 25 సచివాలయాల్లో ఇంటిం టా కొళాయిల ఏర్పాటుతో పాటు, అవసరమైన చోట ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌ల నిర్మా ణాలకు సంబందించి 65 పనులు మంజూరైనట్లు ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ శ్రీచరణ్‌ తెలి పారు.

జలజీవన్‌ మిషన్‌లో 65 పనుల మంజూరు

రేగిడి: మండలంలో జలజీవన్‌మిషన్‌లో భాగంగా 25 సచివాలయాల్లో ఇంటిం టా కొళాయిల ఏర్పాటుతో పాటు, అవసరమైన చోట ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌ల నిర్మా ణాలకు సంబందించి 65 పనులు మంజూరైనట్లు ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ శ్రీచరణ్‌ తెలి పారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి పరిపాలనపరమైన ఆమోదం లభిం చిందని పేర్కొన్నారు. గురువారం రేగిడిలో ఆయన విలేకరులో మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలో 17 గ్రామాల్లో పైప్‌లైన్‌ పనులు జరుగుతుండగా, వీటిలో 15 గ్రామా లకు అధనంగా రూ. 3.74కోట్లుతో పాటు, ఇంత వరకు జలజీవన్‌మిషన్‌ మంజూరు కాని 50 గ్రామాలకు రూ. 3099.90లక్షల కేటాయించినట్లు చెప్పారు. వీటిలో బొడ్డవ లస హెడ్‌ సోర్స్‌ నుంచి రేగిడి, రాజాం మండలాలకు పూర్తిస్థాయి నీటిసరఫరాకు రూ. 1.27 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో ప్రభుత్వ ఆదేశాల ప్రాప్తికి పను లు ప్రారంభిస్తామని చెప్పారు.

Updated Date - 2022-11-25T00:05:58+05:30 IST