ఏర్పాట్లపై సమీక్ష

ABN , First Publish Date - 2022-12-16T23:49:53+05:30 IST

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగం గా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డు రాజాంలో గురువారం సాయంత్రం 5 గంటలకు హాజరవుతా రని ఈ కార్యక్రమం విజయవంతం చేసేలా అందరూ సహ కరించాలని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఆదేశించారు.

 ఏర్పాట్లపై సమీక్ష

రాజాం: ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగం గా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డు రాజాంలో గురువారం సాయంత్రం 5 గంటలకు హాజరవుతా రని ఈ కార్యక్రమం విజయవంతం చేసేలా అందరూ సహ కరించాలని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఆదేశించారు. శుక్రవారం రాజాం క్యాం పు కార్యాల యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ తదితరులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. పర్య టన ఏర్పాట్ల పై చర్చించారు. 22న సాయంత్రం 5 గంటలకు హాజరవుతారని పాలకొండ రోడ్డులో కార్యక్రమం ఉంటుందని కళావెంకటరావు వివరించారు. అనంతరం కంచరాం తృప్తి రిసా ర్ట్స్‌లో రాత్రి భస చేస్తారని తెలిపారు. శనివారం ఉదయం బీసీ నాయకులతో చర్చించిన అనంతరం బొబ్బిలి నియోజకవర్గంలో జరగనున్న ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొం టారని, అన్ని మండలాల నుంచి పార్టీ అభిమానులను పెద్ద ఎత్తున తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్‌ పైల వెంకటరమణ, వంగర మండల పార్టీ మా జీ అధ్యక్షులు బెజ్జిపురపు త్రినాథ, మాజీ సర్పంచ్‌లు శాసపు కేశవనాయుడు, గంట ఖగేంద్రనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:49:54+05:30 IST