రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
ABN , First Publish Date - 2022-12-15T00:10:28+05:30 IST
రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు వనజాక్షి ఆరోపించారు.
- టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు వనజాక్షి
నెల్లిమర్ల: రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు వనజాక్షి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం పూతిక పేట, కొండగుంపాం, గరికిపేట గ్రామాల్లో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మాటామంతి కార్యకరమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి మహిళలతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వనజాక్షి మాట్లాడుతూ... సంక్షేమ పఽథకాల అమలులో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వైసీపీ పాలనపై మహిళలు తీవ్ర అంసతృప్తితో ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి లెంక హైమావతి, పార్టీ మహిళా నాయకులు చిల్లా పద్మావతి, చీకటి సుహాసిని, కోట్ల సునీత తదితరులు పాల్గొన్నారు.