పీడీఎస్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2022-12-15T00:16:40+05:30 IST
గజరాయనివలస గ్రామంలో పరిమి కామేశ్వరరావుకు చెందిన అద్దె ఇంటిలో 82 బస్తాల బియ్యంలో 40.45 క్వింటాళ్లు పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి పట్టుకున్నట్టు తహసీల్దార్ బాలమురళీకృష్ణ తెలిపారు.
బాడంగి: గజరాయనివలస గ్రామంలో పరిమి కామేశ్వరరావుకు చెందిన అద్దె ఇంటిలో 82 బస్తాల బియ్యంలో 40.45 క్వింటాళ్లు పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి పట్టుకున్నట్టు తహసీల్దార్ బాలమురళీకృష్ణ తెలిపారు. వీటి విలువ రూ.లక్షా 53,710గా నిర్ణయించారు. శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా విభాగం అధికారి సురేష్‌బాబు ఆదేశాలపై విజిలెన్స్ అధికారి బి.సింహాచలం, సిబ్బంది, పౌర సరఫరాల డీటీ భాస్కరరావు దాడిచేసి పట్టుకున్నారన్నారు. కామేశ్వరరావుపై కేసు నమోదుచేసినట్టు తెలిపారు. ఈ బియ్యాన్ని తెర్లాం ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించినట్టు చెప్పారు.