కార్మికులకు వేతనాలు చెల్లించండి

ABN , First Publish Date - 2022-11-23T00:22:27+05:30 IST

ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను అప్కాస్‌లో చేర్చి ప్రతి నెలా వేతనాలు చెల్లిం చాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు.

 కార్మికులకు వేతనాలు చెల్లించండి
నిరసన తెలుపుతున్న కార్మికులు

పార్వతీపురంటౌన్‌: ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను అప్కాస్‌లో చేర్చి ప్రతి నెలా వేతనాలు చెల్లిం చాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. మంగళ వారం పార్వతీపురంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య, సెక్యూరిటీ, పెస్టు కంట్రోల్‌ కార్మికులు పెంచిన వేతనాలు చెల్లించాలని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో కార్మికులపై నిర్లక్ష్యం తగదన్నారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతూ జీవో ఇచ్చినా చెల్లించలేదని ఆరోపించారు. వేతనాలు చెల్లించాల్సిన కాంట్రాక్టరు మారడంతో 17నెలలుగా పీఎఫ్‌ ఎంత జమఅవుతుందో, ఈఎస్‌ఐకు ఎంత ఉంచుతున్నారో కార్మికులకు తెలియడంలేదని తెలిపారు.

Updated Date - 2022-11-23T00:22:27+05:30 IST

Read more