సేంద్రియ ఉత్పత్తులదే భవిష్యత్తు

ABN , First Publish Date - 2022-12-16T23:55:15+05:30 IST

ప్రస్తుత రోజుల్లో సేంద్రియ పంటలకు మంచి ఆదరణ లభిస్తోందని భవిష్యత్‌లో ఈ ఉత్పత్తులకు మరింత గిరాకీ పెరగనుందని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు.

సేంద్రియ ఉత్పత్తులదే భవిష్యత్తు

విజయనగరం, డిసెంబరు (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత రోజుల్లో సేంద్రియ పంటలకు మంచి ఆదరణ లభిస్తోందని భవిష్యత్‌లో ఈ ఉత్పత్తులకు మరింత గిరాకీ పెరగనుందని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. శుక్రవారం గాజులరేగలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో కిసాన్‌ మేళా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ భవిష్యత్‌లో రసాయన ఎరువుల ద్వారా పండించే పంటలకు ఆదరణ తగ్గుతుందని, సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలు ఆరోగ్య వంతమైనవి కావటంతో భవిష్యత్‌లో సేంద్రియ ఉత్పత్తులే వాడుతారన్నారు.  రైతు సోదరులు ఆలోచన చేసి సేంద్రియ పంటల వైపు మళ్లాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను, పరికరాలను సం దర్శించారు. నూతన వంగడాల దిగుబడి ఫలాలను ఎరువుల వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అవలంభించిన ఆధునిక పద్ధతుల ఫలితంగా దిగు బడులు పెరిగాయన్నారు. నవ ధాన్యాలు, చిరు ధాన్యాల దిగుబడిలో పెరుగుదల బాగా కన్పించిందన్యానరు. ఈ కిసాన్‌ మేళాలను రైతులు సద్వినియయ్గో పర్చుకో వాలని చూచించారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు, డాట్‌ కేంద్రం కోఆర్డినేటర్‌ కె.లక్ష్మణ్‌, సీనియర్‌ సైంటిస్టు అనురాధ, సో యల్‌ సైంటిస్ట్‌ సంధ్యారాణి, శాస్త్రవేతలు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-12-16T23:55:17+05:30 IST