ప్రైవేటు ఫైనాన్స్‌ ఏజెంట్ల జులుం

ABN , First Publish Date - 2022-08-18T05:29:17+05:30 IST

ప్రైవేటు ఫైనాన్స్‌ ఏజెంట్ల జులుం

ప్రైవేటు ఫైనాన్స్‌ ఏజెంట్ల జులుం
వాహనాన్ని లాక్కుంటున్న ఏజెంట్లు

- బొబ్బిలి జంక్షన్‌లో వాహనదారుడిపై.. 

- వాహనాన్ని తీసుకెళ్లిన వైనం

- 8 గంటల తర్వాత అప్పగింత

రాజాం రూరల్‌, ఆగస్టు 17: రాజాంలో ఓ వాహనదా రుడిపై ప్రైవేటు ఫైనాన్స్‌ ఏజెం ట్లు జులుం ప్రదర్శించారు. వా యితాలు చెల్లించలేదంటూ బైక్‌ ను తీసుకెళ్లారు. మండల పరిధి లోని బొద్దాం గ్రామానికి చెందిన బట్న నారాయణరావు ఓ ప్రైవే టు ఫైనాన్స్‌ నుంచి ద్విచక్ర వాహ నం కొనుగోలుకు రుణం తీసు కున్నాడు. నెలనెలా కచ్చితంగా వాయిదాలను చెల్లిస్తు న్నాడు. అయితే కుటుంబ సభ్యుల అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు సహకరించ క పోవడంతో రెండు వాయిదాలు చెల్లించలేక పోయాడు. దీంతో నలు గురు ఫైనాన్స్‌ ఏజెంట్లు రంగంలోనికి దిగారు. బుధవారం బొద్దాం నుంచి రాజాంలోకి వ స్తున్న నారాయణరావు ను అడ్డగించారు. అతని తో వాగ్వాదానికి దిగారు. వాహనంపై నుంచి తోసేసి ద్విచక్ర వాహనాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. గంట సమయం ఇస్తే చెల్లిస్తానని, లేదా తన సెల్‌ను హామీగా ఉంచితే నగదు తెచ్చి వాయిదా మొత్తం చెల్లి స్తానని నారాయణరావు బతిమలాడాడు. అయినా ఏజెం ట్లు వినుకోలేదు. వాహనాన్ని స్వాధీనం తీసుకుని వెళ్లారు. 

సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్‌ కాని స్టేబుళ్లు వాహనదారుడితో మాట్లాడారు. ఫైనాన్స్‌ ఏజెంట్ల వివరాలను తెలుసుకున్నారు. రెండు వాయి దాలు చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఎనిమిది గంటల తరువాత వాహనాన్ని వాహనదారుడికి ఇప్పించారు. అయితే ఈ సంఘటనపై పొలీసుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. 

Read more