పర్యావరణానికి నష్టం లేకుండా క్వారీ నిర్వహించండి

ABN , First Publish Date - 2022-12-16T23:54:22+05:30 IST

పర్యావరణానికి ఎటువంటి నష్టం లేకుండా క్వారీని నిర్వహించడా నికి చర్యలు తీసుకోవాలని డీఆర్వో ఎం.గణపతిరావు అన్నారు.

పర్యావరణానికి నష్టం లేకుండా క్వారీ నిర్వహించండి

బొండపల్లి: పర్యావరణానికి ఎటువంటి నష్టం లేకుండా క్వారీని నిర్వహించడా నికి చర్యలు తీసుకోవాలని డీఆర్వో ఎం.గణపతిరావు అన్నారు. గరుడుబిల్లి గ్రామంలో సర్వే నెం.187(2)లో 1.970 హెక్టార్ల బిల్డింగ్‌ మెటల్‌తో రోడ్డు నిర్మాణానికి అవసరమైన మెటల్‌ను క్వారీ నుంచి సేకరించేందుకుగాను మూడేళ్ల కాల పరిమితి లో లీజు పునరుద్ధరణకుగాను శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాల య ఆవరణలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి, పరసర గ్రామ ప్రజలకు ఎటువంటి నష్టం లేకుండా క్వారీ నిర్వ హించాలన్నారు. నిబంధనలు పాటించాలన్నారు. నివేదికలను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఈఈ సుదర్శన్‌, భూగర్భ గనులశాఖ ఏడీ మహేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్‌ ఆర్‌.శంకరరావు, ఎస్‌ఐ ఎస్‌.రవి, గరుడుబిల్లి, వేండ్రాం, కొండకిండాం గ్రామాలకు చెందిన గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:54:25+05:30 IST