రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-06-11T05:45:43+05:30 IST

కామవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన డోగ పైడితల్లి(30) అక్కడిక్కడే మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

 మరొకరికి తీవ్ర గాయాలు

పూసపాటిరేగ: కామవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన డోగ పైడితల్లి(30) అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఒమ్మి గ్రామానికి చెందిన బూసర సూరమ్మ అనే మహిళ తీవ్ర గాయాలపాలైంది. పోలీసులు అందజేసిన వివరాల ప్రకారం.. తాపీ పనికోసమని పైడితల్లి, సూరమ్మ అనే కూలీలు సర్వీస్‌ రహదారిలో పైడిభీమవరం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా, విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారు సర్వీసు రోడ్డులో ఉన్న వీరిపైకి దూసుకొచ్చింది. దీంతో పైడితల్లి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడికి  భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయాలపాలైన సూరమ్మను స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఎస్‌ఐ నరేష్‌ కేసు నమోదుచేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

 

Read more