12న జాతీయ లోక్‌అదాలత్‌

ABN , First Publish Date - 2022-10-30T01:00:16+05:30 IST

వచ్చే నెల 12న రాజాం కోర్టు సముదాయ ప్రాంగణంలో జాతీ య లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు మండల న్యాయ సేవాధికార సంస్థ చైౖర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.బాబు తెలిపారు.

12న జాతీయ లోక్‌అదాలత్‌

రాజాం రూరల్‌: వచ్చే నెల 12న రాజాం కోర్టు సముదాయ ప్రాంగణంలో జాతీ య లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు మండల న్యాయ సేవాధికార సంస్థ చైౖర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.బాబు తెలిపారు. శనివారం తన చాంబర్‌లో జూనియర్‌ సివిల్‌ జడ్జి కృష్ణసాయి తేజతో కలిసి పొలీసులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా సహకరించాలని కృషి చేయాలని సూ చిం చారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని కోరారు. సమావేశంలో సీఐ రవికుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమణ మూర్తి, ఏజీపీ పోలారావు, ఏపీపీ సూర్యకుమార్‌, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-30T01:00:20+05:30 IST