ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ప్రణాళిక

ABN , First Publish Date - 2022-07-21T05:14:14+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఎన్నికల కమిషన్‌ శ్రీకారం చుడుతోంది. షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనుంది. ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.

ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ప్రణాళిక


షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల కమిషన్‌
అక్టోబరు నుంచి దరఖాస్తులు స్వీకరణ
కలెక్టరేట్‌, జూలై 20:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఎన్నికల కమిషన్‌ శ్రీకారం చుడుతోంది. షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనుంది. ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి సంబందించి ఈ ఏడాది అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఓటర్ల నమోదు ప్రారంభం కానుంది. మిగిలిన ఎన్నికలకు భిన్నంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. ప్రతిసారి అర్హులైన ఓటర్లు తమ పేర్లును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నవంబరు ఒకటికి డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులంతా  పట్టభద్రుల ఓటు నమోదుకు అర్హులుగా గుర్తించారు. అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 7వ తేదీ వరకూ  నమోదు తంతు జరుగుతుంది. నవంబరు 23న డ్రాప్ట్‌ రోల్‌ విడుదల చేయనున్నారు. అభ్యంతరాలుంటే అదే నెల 23 నుంచి డిసెంబరు 9వ తేదీ వరకూ స్వీకరిస్తారు. డిసెంబరు 30న తేదీ నాటికి తుది జాబితా విడుదల చేస్తారు. గతంలో జరిగిన ఎన్నికలకు జిల్లాలో సుమారు 7వేల మంది ఓటర్లు ఉండే వారు. ఈ సారి ఎంతమంది ఓటు హక్కు నమోదు చేసుకుంటారో చూడాలి.

Updated Date - 2022-07-21T05:14:14+05:30 IST