క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2022-12-31T00:18:53+05:30 IST

జిల్లా కేంద్రంలోని విజ్జీ స్టేడియంలో శుక్రవారం సివిల్‌ విభాగానికి చెందిన సివిల్‌ వారియర్స్‌, చింతలవలస బెటాలియన్‌ రైఫిల్స్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది.

క్రీడలతో మానసిక ఉల్లాసం
విజేతలతో ఎస్పీ దీపికా పాటిల్‌, కమాడెంట్‌ విక్రాంత్‌ పాటిల్‌

విజయనగరం దాసన్నపేట: జిల్లా కేంద్రంలోని విజ్జీ స్టేడియంలో శుక్రవారం సివిల్‌ విభాగానికి చెందిన సివిల్‌ వారియర్స్‌, చింతలవలస బెటాలియన్‌ రైఫిల్స్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. జిల్లా ఎస్పీ దీపికా పాటిల్‌ ఆధ్వర్యంలో సివిల్‌ విభాగానికి చెందిన పోలీసు అధికారులు, చింతలవలస బెటాలియన్‌ కమాం డెంట్‌ విక్రాంత్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో బెటాలియన్‌ పోలీసు అధికారులు, బెటాలియన్‌ రైఫిల్స్‌గా పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మానసిక ఉల్లాసా నికి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ క్రీడలు ఎంతో దోహదపడ తాయ న్నారు. ఎస్పీ మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు పోలీసు అధికారుల్లో ఈ క్రికెట్‌ మ్యాచ్‌ మంచి ఉత్సాహన్ని నింపిందన్నారు. బెటాలియన్‌ కమాండెంట్‌ంట్‌ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ ఇరు జట్లు మంచి స్ఫూర్తితో క్రికెట్‌ ఆడాయని ఉమ్మడిగా పోలీసులు విజేతగా నిలిచారన్నారు. విజేతగా నిలిచిన బెటాలి యన్‌ రైపిల్స్‌కి విన్నర్‌ ట్రోఫీ, రన్నర్స్‌ ట్రోఫీని అందజేశారు. డీఎస్పీలు ఆర్‌ శ్రీనివాస రావు, అసిస్టెంట్‌ కమాండ్‌ంట్‌ంట్‌ పద్మనాభరాజు, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:18:53+05:30 IST

Read more