ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు

ABN , First Publish Date - 2022-04-24T05:38:48+05:30 IST

మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ సభ్యత్వ నమోదును ఆన్‌లైన్‌లో చేపట్టామని, శ్రేణులు శతశాతం విజయవంతం చేయాలని టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలకు శనివారం శిక్షణ ఏర్పాటుచేశారు.

ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు
మాట్లాడుతున్న టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు

టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలి

రామతీర్థం ఆలయ ప్రారంభంపై స్పష్టత ఇవ్వలేదు 

టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు 

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 23: మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ సభ్యత్వ నమోదును ఆన్‌లైన్‌లో చేపట్టామని, శ్రేణులు శతశాతం విజయవంతం చేయాలని టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలకు శనివారం శిక్షణ ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అశోక్‌ మాట్లాడుతూ, క్రమం తప్పకుండా, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వస్తే తప్ప సభ్యత్వ నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తిచేద్దామన్నారు. అంకితభావం కలిగిన కార్యకర్తలు టీడీపీకి సొంతమన్నారు. ఓ ప్రాంతీయ పార్టీ విజయవంతంగా 40 ఏళ్లు పూర్తి చేసుకుందంటే క్రమశిక్షణ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకులు, కార్యకర్తల సైన్యమే కారణమన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును సకాలంలో నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. 

రామతీర్థం ఆలయంపై స్పష్టత లేదు  

రామతీర్థంలోని నూతన ఆలయ ప్రారంభానికి సంబంధించి ఆలయ ఈవో నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదని మాన్సాస్‌ చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు చెప్పారు. రామతీర్థం విషయంలోనే కాక రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చట్టప్రకారం నడుచుకోవడం లేదన్నారు. దొడ్దిదారిన జీవోలు తెచ్చి అస్తవ్యస్త విధానాలు అవలంభించారన్నారు. భక్తుడిగా తాను ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్లవచ్చునని, ఆయా దేవాల యాల చైర్మన్‌గా తనకు తగిన గౌరవం ఇవ్వాలా? లేదా అన్నది ఈవోల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, విజ్జపు ప్రసాద్‌, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, వేచలపు శ్రీను,  కర్రోతు నర్సింగరావు, ప్రసాదుల ప్రసాద్‌తో పాటు తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు. Read more