రవాణాశాఖలో వైద్యాధికారి
ABN , First Publish Date - 2022-10-18T04:39:06+05:30 IST
రవాణాశాఖలో వైద్యాధికారి నియామకానికి ఈనెల 21న ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖఽ అధికారి డాక్టర్ రమణకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నియామకానికి ఇంటర్వ్యూ
పార్వతీపురం, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): రవాణాశాఖలో వైద్యాధికారి నియామకానికి ఈనెల 21న ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖఽ అధికారి డాక్టర్ రమణకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన నియామకం చేపడుతున్నామని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డెప్యుటేషన్‌పై ఏడాది కాలం పనిచేసేందుకు భర్తీ చేస్తున్నామని, అర్హత కలిగిన వారు ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఆమె కోరారు. ఒరిజినల్ ధ్రువపత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకాలు తప్పనిసరి అని చెప్పారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని ఉండాలని స్పష్టం చేశారు.