కొండశిఖర గ్రామాలకు వైద్య సౌకర్యం

ABN , First Publish Date - 2022-12-16T23:45:07+05:30 IST

కొండశిఖర గ్రామాలకు రహదారులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నామని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు.

కొండశిఖర గ్రామాలకు వైద్య సౌకర్యం

కొమరాడ: కొండశిఖర గ్రామాలకు రహదారులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నామని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. బట్టిమొగవలస గ్రామంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా వైద్య శిబిరం నిర్వహిం చిన రోజునే గ్రామానికి రోడ్డు నిర్మాణం పూర్తికావడం ఆనందదాయకమన్నారు. కొంతే సు, నయా పంచాయతీలకు రోడ్డు నిర్మాణానికి, అవసరమైన చోట్ల వెంతన నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి కుటుంబ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. మారుమూల ప్రాం తాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంత రం రెడ్‌క్రాస్‌ సంస్థ ద్వారా పేదలకు దుప్పట్లు, మెడికల్‌ కిట్లును అందజేశారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించారు. గ్రామం మధ్య నుంచి కొండ వరద నీరు పారడంతో ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించి మంజూరు తీసుకోవాలని ఐటీడీఏ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శాంతేశ్వరరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గాకళ్యాణి, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ అధికారి శాంతేశ్వరరావు, ఎంపీడీవో అప్పారావు, తహసీల్దార్‌ రాధాకృష్ణమూర్తి, ఏవో పి.శంకరరావు, రెడ్‌క్రాస్‌ సంస్థ చైర్మన్‌ మంచిపల్లి శ్రీరాములు, కార్యదర్శి బీఎన్‌బీ రావు, ట్రెజరర్‌ పి.సూర్యారావు, సభ్యులు, జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, సర్పంచ్‌ గంగారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:45:10+05:30 IST