నిర్వహణ లేక.. నీరందక
ABN , First Publish Date - 2022-12-15T00:15:47+05:30 IST
సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో కాలువల నిర్వహణ సమర్థలేకపోవడంతో శివారు ఆయ కట్టుకు నీరందడం లేదు.
- కాలువలో పేరుకుపోతున్న వర్థాలు
- సాగునీటికి అన్నదాత బేజారు
- ఇదీ ‘తోటపల్లి ఆయకట్టు’ రైతుల పరిస్థితి
రాజాం రూరల్: సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో కాలువల నిర్వహణ సమర్థలేకపోవడంతో శివారు ఆయ కట్టుకు నీరందడం లేదు. ప్రధానంగా ఏళ్ల తరబడి కాలువల్లో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, వ్యర్థాలు, రెల్లిగడ్డి తొలగించకపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్ప డుతోంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో సైతం నీరందడంలేదని రైతులు వాపోతున్నారు. ఏటా మార్చి నెల తర్వాత కాలువల్లో పిచ్చిమొక్కలు తొలగింపు పనులు నిర్వహించాల్సి ఉంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కిలోమీట ర్ల మేర రెల్లిగడ్డి పెరగడంతో కాలువలు అడవి ప్రాంతాన్ని తలపిస్తున్నాయి.
కాలువల పరిస్థితి ఇలా..
రాజాం మండలంలోని కంచరాం నుంచి గడిముడిదాం మీదుగా రేగిడి మండలానికి సాగునీరందించే కాలువ 52.450 కిలో మీటర్ల నుంచి 117.890 కిలోమీటర్ల వరకూ అధ్వానంగా మారింది. దట్టంగా రెల్లిగడ్డి, పిచ్చిమొక్కలు పెరగడంతో నీరు ప్రవహించని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు నుంచి ఎంజే వలస, బీఎన్వలస, గెడ్డవలస, బొద్దాం మీదుగా శ్రీకాకుళం జిల్లాలోని జి.సి గడాం, రణస్థలం, లావేరు తదితర మండలాల ఆయకట్టుకు సాగు నీరం దించే కాలువ నానాటికి తీసికట్టుగా మారుతోంది. కాగా ఖరీఫ్ సీజన్ ము గిసిందని, ప్రస్తుతం కాలువల్లో సాగునీరు ప్రవహిస్తోందని తోటపల్లి ప్రాజెక్టు ఈఈ ఆర్.రామచంద్రరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తర్వాత కాలువలు మరమ్మతులు చేపడతామని చెప్పారు. గ్రామాల పరిసరాల్లో కాలువల్లో వ్యర్థాలు వేయడం సరికాదని, దీంతో సాగునీటి ప్రవాహం మంద గిస్తోందని చెప్పారు.
పూడికలు తొలగించక.. ప్రవాహం లేక
వంగర: మండలంలో తోటపల్లి కాలువల్లో పూడిక తొల గించక పోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకాలు కలుగుతున్నాయి. ఏళ్ల తరబడి కాలువల్లో పిచ్చిమొక్కలు తొలగించి లైనింగ్ చేయక పోవడంతో ఆనవాళ్లు కోల్పోయాయి. కొప్పర నుంచి సీతారాంపురం వరకు కాలువ పరిధిలో సుమారు ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సిఉంది. దీని పరిధిలో బంగారువలసలతో పటు మరికొన్ని గ్రామాల్లో షిల్టు పేరుకు పోవడంతో కాలువ గట్లు దెబ్బతిన్నాయి. దీంతో పంట పొలాలకు నీరు చొచ్చుకొస్తోంది. కాగా కాలువ పనులకు నిధులు మంజూరు కావడంతో త్వరలో ఈ పనులు చేపడతామని తోటపల్లి ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.
కాలువలు మరమ్మతులు చేసేదెన్నడో?
వంగర: మడ్డువలస రిజర్వాయర్ కాలువలు ద్వారా రబీలో నీరు పనులు పేరుతో నిలిపివేశారు. అయితే అధికారులు పనులు ఎప్పుడు ప్రారంభి స్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారు. రబీలో నీరు విడుదల చేసిన అధికారులు కొద్దిరోజుల్లోనే నిలిపి వేశారు. దీంతో ఆరుతడి పంటలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే కాలువల మరమ్మతులకు నిధులు మంజూరు కావడంతో వెంటనే మరమ్మతులు చేస్తామని ప్రకటించిన అధికారులు ప్రస్తుతం కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలానికి ముందే కాలువలు మరమ్మతులు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. కాగా కాలువ పనులకు ప్రభుత్వం 1.80 కోట్లు రూపాయలు విడుదల చేసిందని డీఈ నర్మదా పట్నాయక్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాలువలు పూర్తిస్థాయిలో ఎండిన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే ప్రధాన గేట్లు మరమ్మతులు చేస్తామని తెలిపారు.