చంద్రబాబు పర్యటన విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-12-16T23:46:14+05:30 IST

విజయనగరం రూరల్‌: విజయనగరం నియోజకవర్గంలో 24న టీడీపీ అధి నేత చంద్రబాబు నాయుడు పర్యటనను విజయంతం చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం పార్టీ నగర, మండల పార్టీ, వాటి అనుబంధ సంఘాల కార్యవర్గాలతో, సాయంత్రం నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఆమె నిర్వహించి మా ట్లాడారు. నియోజకవర్గంలోని సమస్యలను అధినేత దృష్టికి ఏ విధంగా తీసుకువెళ్లా లన్న దానిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించారు.

ఫ టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాజీ ముని సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రసాదుల రామకృష్ణని దాసన్నపేటలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఏడాది క్రితం ఆయన గుండెకు శస్త్ర చికిత్స జరగి, ప్రస్తుతం ఇం ట్లో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో యనమల శుక్రవారం ఉదయం ప్రసాదు ల నివాసానికి వెళ్లి మాట్లాడారు. ఫ విజయనగరం వచ్చిన మాజీ మంత్రి యన మల రామకృష్ణుడిని.. ఉల్లివీధిలోని ఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రాంగణంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం నాయకుడు ముచ్చి రామలింగస్వామి యాదవ్‌ ఆధ్వ ర్యంలో ఆ సంఘం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా యాదవులు ఎదుర్కొంటు న్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

Updated Date - 2022-12-16T23:46:55+05:30 IST