మహాసభలు జయప్రదం చేయాలి
ABN , First Publish Date - 2022-12-07T23:58:47+05:30 IST
హైద రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 13 నుంచి 16 వరకూ జరగనున్న ఎస్ ఎఫ్‌ఐ మహాసభలకు విద్యార్థులు భారీ ఎత్తు న హాజరై జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రామ్మోహన్‌రావు పిలుపుని చ్చారు.
విజయనగరం దాసన్నపేట: హైద రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 13 నుంచి 16 వరకూ జరగనున్న ఎస్ ఎఫ్‌ఐ మహాసభలకు విద్యార్థులు భారీ ఎత్తు న హాజరై జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రామ్మోహన్‌రావు పిలుపుని చ్చారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులపై నిరంతరం పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమాలకు కార్యాచరణ రూ పొందించేందుకు, ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలను తెలంగాణ గడ్డపై నిర్వహిస్తున్నా మ న్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన జాతీయ విద్యా విధానంకోసం యూనివర్సిటీల్లో బీజేపీ అనుబంధ ఆర్‌ఎస్‌ఎస్ భావజాల వైఎస్ ఛాన్సలర్లను నియ మించే ప్రయత్నం చేస్తోందన్నారు. యూనివర్సీటీ విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో మత భావజాలం ఎక్కించే ప్రయత్నా న్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రతినిధులు వెంకటేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.