కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి
ABN , First Publish Date - 2022-10-17T05:43:02+05:30 IST
కుక్కల దాడిలో గొర్రెపిల్లలు మృతిచెందిన ఘటన మరడారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
దత్తిరాజేరు: కుక్కల దాడిలో గొర్రెపిల్లలు మృతిచెందిన ఘటన మరడారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బుంగ ఆదినారాయణ, రాములమ్మల కు చెందిన గొర్రెలు పాకలో ఉండగా ఆదివారం వేకువజామున కొన్ని వీధి కుక్కలు వచ్చి, ఒక్కసారిగా దాడిచేశాయి. ఈ దాడిలో 20 గొర్రె పిల్లలు మృతిచెందాయి. ఆరు గొర్రెలు గాయపడ్డాయి. సుమారు రూ.70వేలు నష్టం కలిగిందని బాధితులు రోధిస్తున్నా రు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరారు.