పది పరీక్షలకు వేళాయే..

ABN , First Publish Date - 2022-12-31T00:31:18+05:30 IST

పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం గంట మోగించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 3 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

 పది పరీక్షలకు వేళాయే..

సాలూరు రూరల్‌, డిసెంబరు 30: పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం గంట మోగించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 3 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు సీబీఎస్‌ఈ తరహాలో టెన్త్‌ పరీక్షలను రోజు విడిచి రోజు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఆరు పేపర్లతో పరీక్ష నిర్వహించనున్నారు. భౌతిక, జీవశాస్త్రం కలిపి సైన్స్‌లో ఒకే పేపరులో ప్రశ్నాపత్రం రూపొందించనున్నారు. కొత్త జిల్లాల ప్రాతిపాదికగా పరీక్షలను నిర్వహించే అవకాశాలున్నాయి. మన్యంలో 227 పైగా ఉన్నత పాఠశాలలున్నాయి. వాటి నుంచి ఈ ఏడాది 9 వేలకు పైగా విద్యార్థులు టెన్త్‌ పరీక్షలను రాయనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 3న తెలుగు ,6న హిందీ, 8న ఇంగ్లీషు, 10న గణితం, 13న సైన్స్‌, 15న సోషల్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. సైన్స్‌లో మాత్రం భౌతిక శాస్త్రంలో 16 ప్రశ్నలు, జీవశాస్త్రంలో 17 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఇవ్వనున్నారు. సమాధానాలు రాయడానికి వేర్వేరు పత్రాలివ్వనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఉపాధ్యాయులు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. శతశాతం ఉత్తీర్ణత, అత్యధిక మార్కులు సాధనకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

Updated Date - 2022-12-31T00:31:19+05:30 IST