‘మన్యం’లో పెరుగుతున్న శిశు మరణాలు
ABN , First Publish Date - 2022-12-16T23:52:20+05:30 IST
అరకు పార్లమెంట్ పరిధిలోని రెండు జిల్లా ల్లో శిశువులు, విద్యార్థుల మరణాలు పెరుగు తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యా రాణి ఆరోపించారు.
సాలూరు రూరల్: అరకు పార్లమెంట్ పరిధిలోని రెండు జిల్లా ల్లో శిశువులు, విద్యార్థుల మరణాలు పెరుగు తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యా రాణి ఆరోపించారు. శుక్రవారం తన నివాసంలో మాట్లాడుతూ.. మన్యంలో 2019 నుంచి 2022 డిసెంబరు వరకూ 1280 చిన్నారులు మరణించా రని తెలిపారు. వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫల మైందన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆసుపత్రులున్నా సరైన వైద్యులు, మందులు లేవని, పౌష్టికాహారం కూడా అందక పోవడంతో గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోతున్నార న్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.