మెనూ చార్జీలు పెంచండి
ABN , First Publish Date - 2022-12-07T00:00:26+05:30 IST
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మెనూ చార్జీలు పెంచా లని ఎండీఎం నిర్వాహకులు డిమాండ్ చేశారు.
గరుగుబిల్లి: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మెనూ చార్జీలు పెంచా లని ఎండీఎం నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గరుగుబిల్లి ఎంఈవో కార్యాలయంవద్ద మంగళవారం సీఐటీయూఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎండీఎం నిర్వాహకుల సంఘం నాయకురాలు పి.పావని, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ మాట్లాడుతూ మెనూ చార్జీలు పెంచకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి రూ.20 మెనూ చార్జీ, కార్మికులకు వేతనం రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గౌరమ్మ, పార్వతీ పాల్గొన్నారు.