గజరాజుల హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-11-21T00:58:24+05:30 IST

మండలవాసులను గజరాజులు వణికిస్తున్నాయి. ప్రధానంగా పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.

గజరాజుల హల్‌చల్‌
గారవలస సమీపంలో గజరాజులు ధ్వంసం చేసిన మొక్కజొన్న పంట

కొమరాడ, నవంబరు 20 : మండలవాసులను గజరాజులు వణికిస్తున్నాయి. ప్రధానంగా పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. కళ్లికోట పంచాయతీ గారవలస సమీప పొలాల్లో తిష్ఠ వేసిన ఏనుగులు శనివారం రాత్రి మొక్కజొన్న పంటలను నాశనం చేశాయి. వేలాది రూపాయల మదుపులు పెట్టి.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందొస్తున్న తరుణంలో ఇలా జరగడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం , అటవీశాఖాధికారులు స్పందించి ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పంటలు, రైతుల ప్రాణాలను రక్షించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-11-21T00:58:24+05:30 IST

Read more