బిల్లుల్లో పది శాతం ఇవ్వాలంటే ఎలా?

ABN , First Publish Date - 2022-12-07T23:54:26+05:30 IST

ఐసీడీఎస్‌ల పరిధిలో అంగన్‌డీ కేంద్రాలకు ఇచ్చే గ్యాస్‌, పోపుల బిల్లుల్లో పదిశాతం ఆమ్యామ్యాలు చెల్లించాలని సంబంధిత అధికారులు ఒత్తిడి చేయడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు ఆరోపించారు.

బిల్లుల్లో పది శాతం ఇవ్వాలంటే ఎలా?

బొబ్బిలి: ఐసీడీఎస్‌ల పరిధిలో అంగన్‌డీ కేంద్రాలకు ఇచ్చే గ్యాస్‌, పోపుల బిల్లుల్లో పదిశాతం ఆమ్యామ్యాలు చెల్లించాలని సంబంధిత అధికారులు ఒత్తిడి చేయడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు ఆరోపించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడు తూ... గ్యాస్‌, వంట సామగ్రి కోసం గర్భిణులు, బాలింతలకు ఒక్కొక్క రికి రూ.4.50, పిల్లలకు 75 పైసల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ఈ బిల్లుల మొత్తంలో పదిశాతం విధిగా చెల్లించాలని జిల్లాలో కొంతమంది ఎస్‌టీవోలు, పీవోలు, సూపర్‌వైజర్లు ఒత్తిడి తేవడం దారుణమన్నారు. రామభద్రపురం మండలంలో కూడా ఈ తరహా ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-07T23:54:27+05:30 IST