వరద బాధితులకు సాయం అందించండి

ABN , First Publish Date - 2022-08-04T05:45:32+05:30 IST

ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి తోచినంత సాయం అందించేందుకు కార్య కర్తలు ముందుకు రావాలని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ కోరారు.

వరద బాధితులకు సాయం అందించండి

రాజాం: ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి తోచినంత సాయం అందించేందుకు కార్య కర్తలు ముందుకు రావాలని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ కోరారు. బుధవారం రాత్రి శ్యాంపురం కోండ్రు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి నాయ కు లు, కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేప డుతున్నామన్నారు. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్య లు చేపట్టలేదన్నారు.  సీనియర్‌ నాయకులు పొట్టా చిట్టిబాబు, దుప్పల పూడి శ్రీనివాసరావు, టంకాల కన్నంనాయుడు, శాసపు రమేష్‌కుమార్‌, రాజాం, వంగర, సంతకవిటి,రేగిడి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:45:32+05:30 IST