అజ్జాడలో ధాన్యం దగ్ధం

ABN , First Publish Date - 2022-12-31T00:10:20+05:30 IST

బలిజిపేట మండలంలోని అజ్జాడలో వరి చేను, ధాన్యం, గడ్డి కుప్పలు శుక్రవారం రాత్రి దగ్ధమయ్యాయి.

  అజ్జాడలో ధాన్యం దగ్ధం

సీతానగరం: బలిజిపేట మండలంలోని అజ్జాడలో వరి చేను, ధాన్యం, గడ్డి కుప్పలు శుక్రవారం రాత్రి దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం మేరకు... విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల సంభవించిన మంటల్లో మామిడి గుంపస్వామికి చెందిన వరిచేను కాలిపోయింది. అలాగే గ్రామస్థులు శివాలయ అర్చనకు మాన్యం నిమిత్తం ఆలయ అర్చకుడు బోనాల చంద్రశేఖర్‌ భూమిని పండించుకోవాలని ఇచ్చారు.ఆ భూముల నుంచి పండగా సేకరించిన ధాన్యం సుమారు పదిబస్తాల వరకు కాలి బూడిద య్యాయి. మామిడి పైడయ్యకు చెందిన వరి చేను దగ్ధమయ్యింది.వీటితోపాటు మరికొంతమంది రైతుల గడ్డికుప్పలు కూడా కాలిపోయాయి. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు అంచనావేస్తున్నారు.

Updated Date - 2022-12-31T00:10:20+05:30 IST

Read more