‘ఆశా కార్యకర్తలపై ప్రభుత్వానికి కపట ప్రేమ’
ABN , First Publish Date - 2022-12-15T23:47:47+05:30 IST
ఆశాకార్యకర్తలపై జగన్ ప్రభ్వుతం కపట ప్రేమ తో వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఇందిరాదేవి ఆరోపించారు.
పార్వతీపురం-ఆంధ్రజ్యోతి: ఆశాకార్యకర్తలపై జగన్ ప్రభ్వుతం కపట ప్రేమ తో వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఇందిరాదేవి ఆరోపించారు. గురువారం పార్వతీపురంలో సీఐటీయూ, ఆశావర్కర్ల యూనియన్ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించిన ప్రభుత్వం, 2,500 మందికి ఒక ఆశాకార్యకర్తను నియమించి పనిఒత్తిడికి గురిచేస్తోం దన్నారు. పెరుగుతున్న జనాభాకుఅనుగుణంగా ఆశాకార్యకర్తల సేవలను పెంచాల్సిం ది పోయి.. కుదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆశా కార్యకర్తల సమస్యలపై దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ ప్రతినిధులు గొర్లి వెంకటరమణ, టి.కృష్ణవేణి, ఎం.గౌరి పాల్గొన్నారు.