డంగభ ద్రలో గజరాజులు
ABN , First Publish Date - 2022-12-16T23:57:49+05:30 IST
మండలవాసులకు గజరాజుల బెడద వీడడం లేదు.
కొమరాడ, డిసెంబరు 16 : మండలవాసులకు గజరాజుల బెడద వీడడం లేదు. అంతర్రాష్ట్ర రహదారి, రైల్వే లైన్ దాటుకుని అర్తాం అటవీ ప్రాంతంలో ఉన్న ఏనుగులు శుక్రవారం జంఝావతి డ్యాం సమీప గ్రామమైన డంగభద్రకు చేరుకున్నాయి. దీంతో కోనవలస, కురుంపేట, బొడ్డవలస, తదితర గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది రాత్రి పూట అందుబాటులో ఉండడం లేదని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకముందే ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.