ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చండి

ABN , First Publish Date - 2022-12-07T23:57:03+05:30 IST

విశ్వ బ్రాహ్మణులకు ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవే ర్చాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ముగడ వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చండి

బొబ్బిలి: విశ్వ బ్రాహ్మణులకు ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవే ర్చాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ముగడ వెంకటరమణ డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నాడు జగన్‌ పాదయాత్ర సమయంలో విశ్వ బ్రాహ్మణులకు చట్టసభల్లో ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారని, అయతే ఇంతవరకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదని తెలిపారు. స్వర్ణకారులకు మంగళసూత్రం తయారీ పేటెంట్‌ హక్కులు కల్పిస్తామని, కార్పెంటర్లకు అటవీశాఖ సిబ్బంది నుంచి వేధింపులు లేకుండా చూస్తామని హామీ లిచ్చి .. నేడు పూర్తిగా మారిచారని చెప్పారు. దొంగ బంగారం పేరుతో స్వర్ణకారులకు అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని, బీసీ కార్పొరేషన్‌ ద్వారా కులవృత్తిదారులకు రుణాలు, పనిముట్లు అందజేస్తామని హామీలు గుప్పించారన్నారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఎటువంటి స్పందన లేదని, హామీల అమలు ఊసే లేదని తెలిపారు. ఇకనైనా సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి విశ్వబ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ యువజన ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ములపాటి బంగార్రాజు, జిల్లా సమన్వయకర్త ప్రసాద్‌, టీడీపీ పట్టణ కార్యదర్శి కేశనకుర్తి త్రినాథ ఆచారి, తుమరాడ గంగాధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:57:04+05:30 IST