10లోగా ఫీజులు చెల్లించాలి: డీఈవో

ABN , First Publish Date - 2022-11-24T00:45:22+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి డిసెంబరు 10లోగా ఫీజులు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌డీవీ రమణ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.

10లోగా ఫీజులు చెల్లించాలి: డీఈవో

పార్వతీపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి డిసెంబరు 10లోగా ఫీజులు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌డీవీ రమణ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఫీజులను ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాల్సి ఉందన్నారు. నవంబరు 25 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీనిపై హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించి సకాలంలో ఫీజులు చెల్లించేలా చూడాలని సూచించారు.

Updated Date - 2022-11-24T00:45:28+05:30 IST

Read more