ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో సేవలు అందడం లేదు

ABN , First Publish Date - 2022-12-31T00:24:18+05:30 IST

స్థానిక ఈఎస్‌ఐ డి స్పెన్సరీలో నాణ్యమైన వైద్యసేవ లందించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కార్మికులు ధర్నా నిర్వహించారు

ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో సేవలు అందడం లేదు

బొబ్బిలి: స్థానిక ఈఎస్‌ఐ డి స్పెన్సరీలో నాణ్యమైన వైద్యసేవ లందించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. నవ్యా జూట్‌ మిల్లుకు చెందిన మురళి అనే కా ర్మికుడు గాయపడడంతో చికిత్స కోసం డిస్పెన్సరీకి వెళితే అక్కడ ఉన్న ఒకే ఒక్క అటెండరు తానే మీ చేయలేనని, ప్రైవేట్‌ ఆసుప త్రికి వెళ్లాలని బదులిచ్చారు. వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి, వేలి గాయానికి చికిత్స తీసుకున్నాడు. దీనిపై కార్మికులు ఆగ్రహం వ్య క్తం చేస్తూ ఈఎస్‌ఐ డిసెన్సరీ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు పి.శంకరరావు మాట్లాడుతూ ప్రతి నెలా కార్మికులు తమ జీ తంలో నుంచి డబ్బులను జమ చేస్తున్నప్పటికీ అవసరమైన వైద్య సేవలను అం దించకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బొబ్బిలి ప్రాంతంలో సుమారు 2500 మంది కార్మికులు ఈఎస్‌ఐ కార్డుదారులుగా ఉన్నారని, కార్మికులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచకపోవడం సరికాదన్నారు. కార్మికులకు నాణ్యమైన వైద్యసేవలందించాలని, మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. జూట్‌మిల్లు కార్మిక అధ్యక్షుడు చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:24:20+05:30 IST