బొంగుడుగూడ సమీపంలో ఏనుగులు

ABN , First Publish Date - 2022-10-07T05:35:43+05:30 IST

మండలంలోని పెద్దూరు పంచాయతీ పరిధిలో ఉన్న బొంగుడు గూడ సమీపంలో రెండు ఏనుగులు సంచరిస్తున్నాయి.

బొంగుడుగూడ సమీపంలో ఏనుగులు
అటవీ ప్రాంతలో సంచరిస్తున్న ఏనుగులు

సీతంపేట: మండలంలోని పెద్దూరు పంచాయతీ పరిధిలో ఉన్న బొంగుడు గూడ సమీపంలో రెండు ఏనుగులు సంచరిస్తున్నాయి. జక్కరవలస మీదుగా మంగళవారం రాత్రి ఏనుగులు బొంగుడు గూడ అటవీ ప్రాంతానికి చేరాయి. గత రెండు రోజులుగా మన్యంలో భారీ వర్షాలు కురవడంతో ఏనుగులు ఈ ప్రాంతాన్ని కదిలి వేరే ప్రాంతానికి వెళ్లడం లేదని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. వరినాట్లు ను ఏనుగులు ధ్వసం చేస్తుండడంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారు. ఈ ప్రాం తం ఏనుగులకు అనువుగా మారడంతో ఈ ప్రాంతంలో ఏనుగులు తిష్ట వేసిన ట్టు అటవీ అధికారులు తెలిపారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా కుక్కలు అరుస్తూ వాటిని కొండలపైకి వెంటాడుతున్నాయి.

 


Updated Date - 2022-10-07T05:35:43+05:30 IST