-
-
Home » Andhra Pradesh » Vizianagaram » elephants in aartham village-NGTS-AndhraPradesh
-
అర్తాంలో ఏనుగుల గుంపు
ABN , First Publish Date - 2022-08-31T05:33:17+05:30 IST
గత కొద్ది రోజులుగా జియ్యమ్యవలస మండలం బాసంగి, పెదకుదమ, నాగావళి నది ఆవల దళాయిపేట గ్రామాల్లో సంచరించిన గజరాజులు ఇప్పుడు అర్తాం కొండ వైపునకు వచ్చాయి.

కొమరాడ, ఆగస్టు 30 : గత కొద్ది రోజులుగా జియ్యమ్యవలస మండలం బాసంగి, పెదకుదమ, నాగావళి నది ఆవల దళాయిపేట గ్రామాల్లో సంచరించిన గజరాజులు ఇప్పుడు అర్తాం కొండ వైపునకు వచ్చాయి. మంగళవారం అవి కనిపించడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గజరాజులు సృష్టించిన బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నాగావళి నది దిగిన ఏనుగులు ఈ ప్రాంతానికి రావడంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.