విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-10-17T05:42:18+05:30 IST

విద్యుదాఘాతంతో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలం లోని జామి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి

జామి: విద్యుదాఘాతంతో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలం లోని జామి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బలరాంపురం గ్రామానికి చెందిన గుర్రంపల్లి బంగా రయ్య(64) అనే వ్యక్తి ఆదివారం ఉదయం వంటచెరకు కోసం గ్రామ సమీపంలోని భీమసింగి వేంకటేశ్వరస్వామి ఆలయం వెనుకభాగంలో ఉన్న తోటలోకి వెళ్లాడు. అయితే ఇక్కడ వేలాడుతున్న విద్యుత్‌ తీగను గమనించకుండా తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు చూసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుడి భార్య గుర్రమ్మ ఫిర్యాదుమేరకు జామి పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.


కందిశలో ముగ్గురికి  గాయాలు

రేగిడి: మండలంలోని కందిశలో విద్యుదాఘాతం వల్ల  ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని  ఓ ప్రైవేటు పాఠశాల లో  రజస్వల ఫంక్షన్‌  జరుగుతున్న సమయంలో కొందరు  విద్యార్థులు  డాబాపై ఎక్కి దగ్గరిలో ఉన్న విద్యుత్‌వైర్లకు తాకారు. దీంతో విద్యార్థులు కె.రాంబాబు, వి.జ స్వంత్‌తోపాటు మరో విద్యార్థి గాయపడ్డారు. దీంతో వీరిని రాజాంలోని ఆసుపత్రికి తరలించారు. 

 

Updated Date - 2022-10-17T05:42:18+05:30 IST