ఉపాధ్యాయుడిని బదిలీ చేయొద్దు
ABN , First Publish Date - 2022-12-15T23:56:35+05:30 IST
మండలంలోని కుమరాం పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తు న్న రామకృష్ణ బదిలీని వెం టనే నిలిపివేయాలని కోరు తూ పాఠశాల విద్యార్థుల తల్లి దండ్రులు గురువారం సా యంత్రం పాఠశాలలో నిరస న ప్రదర్శన నిర్వహించారు
జామి: మండలంలోని కుమరాం పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తు న్న రామకృష్ణ బదిలీని వెం టనే నిలిపివేయాలని కోరు తూ పాఠశాల విద్యార్థుల తల్లి దండ్రులు గురువారం సా యంత్రం పాఠశాలలో నిరస న ప్రదర్శన నిర్వహించారు. ఇక్కడ పనిచేస్తున్న రామకృష్ణకు మండలంలోని లొట్ల పల్లి ఉన్నత పాఠశాలకు బదిలీ అయినట్లు ఉత్తర్వులు వచ్చాయి. విషయం తెలుసు కున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడిని బదిలీ చేయొద్దని కోరుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు ఉన్నతంగా విద్యాబోధన చేస్తూ వారిలో ఉత్సాహం నింపుతున్నారని, చదు వులో వెనుకబడిన విద్యార్థులను సైతం రాణించేలా తీర్చిదిద్దుతున్నారని అటువంటి ఉపాధ్యాయుడిని బదిలీ చేయొద్దని నినాదాలు చేశారు. వెంటనే గణిత ఉపా ధ్యాయుడు బదీలీ నిలుపుదల చేయాలనీ నినాదాలుచేశారు.
1111111111111