అనుమతులు లేకుండా విద్యుత్తు పనులు చేయొద్దు

ABN , First Publish Date - 2022-12-31T00:17:41+05:30 IST

గ్రామాల్లో ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా విద్యుత్‌ నిర్వాహణ పనులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్ర దేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ కె.సత్య పరిపూర్ణకుమార్‌ అన్నారు.

 అనుమతులు లేకుండా విద్యుత్తు పనులు చేయొద్దు

భోగాపురం: గ్రామాల్లో ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా విద్యుత్‌ నిర్వాహణ పనులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్ర దేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ కె.సత్య పరిపూర్ణకుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక విద్యుత్తు కార్యాలయంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లు, విద్యుత్‌ సిబ్బందికి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విద్యుత్‌ కారణంగా మరణాలు సంభవి స్తున్నాయని వాటిని నిర్మూలించడానికి ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు విద్యుత్‌ నిర్వాహణ పనుల కారణంగా ఎటువంటి ప్రమాదానికి గురైనా బాధ్యత వహించబోమన్నారు. విద్యుత్‌ వినియోగదారులు విద్యుత్‌ సమస్యలు వస్తే 1912 నెంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. గ్రామాల్లో సమస్యలుంటే 8500001912 వాట్సాప్‌ నెంబర్‌కు ఫొటో పంపంచాలని సూచించారు. విద్యుత్‌ వినియోగదారులు కాల్‌ చేసిన వెంటనే జానియర్‌ లైన్‌మేన్లు స్పందించ కపోతే పైఅధికారుల కు ఫిర్యాదు చేయాలని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్‌ లైన్లు సరి చేసేందుకు భోగాపు రం, పూసపాటిరేగ, డెంకాడ మండలాలకు రూ.1.80 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ మండలాల ఏఈలు కె.జ్యోతీశ్వరరావు, పీఏఎస్‌ నాయుడు, బి.నాగేశ్వరరావు, లైన్‌మేన్లు, జూనియ ర్‌ లైన్‌మేన్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:17:43+05:30 IST