దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

ABN , First Publish Date - 2022-12-15T23:50:48+05:30 IST

మండలంలోని మంగళపాలెం గురుదేవ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.

దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గురుదేవ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. నాలుగు జిల్లాల్లోని దివ్యాంగులను ముందుగా గుర్తించి వారికి అవసరమైన అవయవాలను తయారు చేయించారు. మొదటి విడతగా 300మందికి పంపిణీ చేస్తున్నామని ట్రస్టు వ్యవస్థాపకుడు జగదీష్‌ బాబు తెలిపారు. గురువారం నిర్వహించిన కార్యక్రమానికి వికలాంగులు, వయోవృద్ధుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముంతాజ్‌ పఠాన్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కృత్రిమ అవయవాలతో పాటు చెవిటి మిషన్లు, బ్లైండ్‌ స్టిక్స్‌, వాకర్స్‌, వీల్‌చైర్స్‌, హ్యాండ్‌క్రచర్స్‌, పోలియో కాలిపర్స్‌ అందజేశామన్నారు.

Updated Date - 2022-12-15T23:50:49+05:30 IST