వైసీపీ ప్రభుత్వ పాలనపై అసంతృప్తి
ABN , First Publish Date - 2022-12-31T00:15:10+05:30 IST
వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నా రని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు అన్నారు.
భోగాపురం: వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నా రని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు అన్నారు. భోగాపురం గ్రామం లో పార్టీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలాపు అప్పల రామిరెడ్డి, పార్లమెంటు కార్యనిర్వాహణ కార్యదర్శి కర్రోతు రాజు, క్లస్టర్ ఇన్‌చా ర్జి దాసరి అప్పలస్వామి, కోరాడ తాతారావు, వనుం హరి, పట్టా శ్రీరాములు, లక్ష్మణరావు పాల్గొన్నారు.
ఎస్.కోట రూరల్: ఎస్.కోట మండలం వినాయకపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
దత్తిరాజేరు: దత్తిరాజేరు గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు పెద్దింటి మోహన్ ఆధ్వర్యంలో శుక్రవా రం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బెజవాడ బంగారునాయుడు, మిత్తిరెడ్డి గౌరినాయుడు పాల్గొన్నారు.