రూ.11.81 కోట్లతో కళాశాలల అభివృద్ధి
ABN , First Publish Date - 2022-12-15T00:11:18+05:30 IST
జిల్లాలో గల జూనియర్ కళాశాలను రూ.11.81 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు జిల్లా వృత్తి వి ద్యాశాఖాధికారి ఆర్.సురేష్ కుమార్ అన్నారు.
గజపతినగరం: జిల్లాలో గల జూనియర్ కళాశాలను రూ.11.81 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు జిల్లా వృత్తి వి ద్యాశాఖాధికారి ఆర్.సురేష్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక జూనియర్ కళాశాలలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రెండో విడత నాడు-నేడు పనుల్లో భాగంగా జిల్లాలోని 17 కళాశాలల్లో పనులు ప్రారంభించామన్నారు. ఇంతవరకు రూ.1.70 కోట్లతో విడుదల చేసినట్టు స్పష్టం చేశారు. ఇంటర్ విద్యార్థులకు సంబంధించి కామన్ పేపర్ ద్వారా జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 50 వరకు అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, 20 మందిని గెస్ట్ ఫ్యాకల్టీ కింద నియమించామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ సీహెచ్ విజయకుమారి తదితరులు ఉన్నారు.