టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2022-12-31T00:08:49+05:30 IST

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని సాలూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.

   టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం
ర్యాలీ నిర్వహిస్తున్న సంధ్యారాణి

మక్కువ: టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని సాలూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. శుక్ర వారం మండలంలోని పనసభద్ర, దుగ్గేరు, మూలవలసలో జగన్‌ పాలనలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సురాపాడు ప్రాజెక్టుకు నిధులు ఖర్చు చేసి గిరిజన రైతులకు సాగునీరు అందించామని గుర్తుచేశా రు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించక సాగునీరు ప్రశ్నార్ధకమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ యువతకు రుణాలు అందించిన ఘనత తమపార్టీదేనన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూ న్యంగా మారి ఫ్యాక్షన్‌ వాతావరణం నెలకొంద న్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు గుళ్ల వేణుగోపాల్‌, నాయకులు బి.గౌరీశంకర్‌, డాక్టర్‌ మల్లేశ్వరరావు, గొంగాడ భూషణ్‌ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కారంలో విఫలం: బొబ్బిలి చిరంజీవులు

పార్వతీపురం రూరల్‌: ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరం జీవులు ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పెదమరికి పంచాయతీలో రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్థిదించాలనిప్రజలను కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను చిరంజీవులు తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోను దేవిచంద్రమౌలి, గొట్టాపు వెంకటనాయుడు, బి.రవికుమార్‌, యం.సత్యం నాయుడు పాల్గొన్నారు.

ఉపాధి కల్పనకు కానరాని చర్యలు

ఫ కురుపాం నియోజకవర్గ

టీడీపీ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం: సీఎంవైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడం లేదని కురుపాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి ఆరో పించారు. ఈ మేరకు శుక్రవారం భద్రగిరిలో గల అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా విలేకరు లతో మాట్లాడుతూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ జనవరి 27వ తేదీ నుంచి యువగళం పేరుతో చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఉపాధి కల్పన చర్యలు కానరావడం లేదని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-12-31T00:08:51+05:30 IST