రాష్ట్రంలో విధ్వంసకర పాలన
ABN , First Publish Date - 2022-12-07T23:55:58+05:30 IST
రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని, కొంత మంది ఐఏఎస్ అధికారులకే ఈ నెల జీతాల్విలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉం దని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
సాలూరు రూరల్: రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని, కొంత మంది ఐఏఎస్ అధికారులకే ఈ నెల జీతాల్విలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉం దని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్టీ సాలూరు మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు ఆధ్వర్యంలో బుధ వారం కొట్టుపరువు పంచాయతీ పరిధి ఎరగడవలస తదితర గ్రామాల్లో నిర్వ హిం చిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ నెల జీతాలు ఉద్యోగ, ఉపాధ్యాయులకు 7వ తేదీ వచ్చినా చెల్లించలేక పోవ డం దురదృష్టకరమన్నారు. ఈ జాబితాలోనే కొందరు ఐఏఎస్ అధికారు లు కూడా ఉండడం దారుణమన్నారు. ఎస్టీలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. పార్టీ నాయకులు గుళ్ల వేణు, అక్యాన తిరుపతి రావు, ఆము జూరు శ్రీనివాసరావు, బందాపు సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం: రాష్ట్రం విధ్వంసకర పరిపాలన కొనసాగుతోందని పార్వతీ పురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బొబ్బిలి చిరంజీవులు ఆరో పించారు. బుధవారం లచ్చయ్యపేట గ్రామంలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొను గోలు త్వరగా చేపట్టాలన్నారు. చెరకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశా రు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. కార్య క్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొల్లి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి రౌతు వేణుగోపాలరావు, బలిజిపేట మండలానికి చెందిన పార్టీ నాయకులు గర్భాపు ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.
పూసపాటిరేగ: కనిమెళ్ల గ్రామంలో బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో ‘ఇ దేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పా ర్టీ నాయకులు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకుని న మోదు చేసుకున్నారు. మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీల పాలన కొనసాగుతుందని ఆరోపించారు. రా ష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, వైసీపీ నాయకులు మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు మ హంతి శంకరరావు, నాయకులు పతివాడ తమ్మినాయుడు, దురగాసి సూర్యా రావు, ముత్యాల రమణ, చందక ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
పూసపాటిరేగ(భోగాపురం): భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రా మంలో బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. పార్టీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, నాయకులు దాసరి అప్పల స్వామి, నీలపు అప్పలరామిరెడ్డి, కోరాడ తాతారావు తదితరులు పాల్గొన్నారు.
లక్కవరపుకోట: రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్ర బాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. బుధవారం సా యంత్రం కొట్యాడ గ్రామంలో నిర్వహించిన ‘ఇదేంకర్మ మన రాష్ట్రానికి’ కార్యక్ర మంలో భాగంగా ర్యాలీ నిర్వహించి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిజిల్, పెట్రోల్, గ్యాస్, పప్పు, నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని విమర్శించారు. ఇంటింటికీ వెళ్లి పోస్ట ర్లను పంపిణీ చేశారు. టీడీపీ నేతలు మల్లునాయుడు, రమణ మూర్తి, కరెడ్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.