కటింగ్‌ చేస్తూ.. చైన్ల దొంగతనం

ABN , First Publish Date - 2022-12-13T23:55:52+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీలో సెలూన్‌ షాపు నిర్వాహకుడు బెల్లపు శ్రీనును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

కటింగ్‌ చేస్తూ.. చైన్ల దొంగతనం

విజయనగరం క్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీలో సెలూన్‌ షాపు నిర్వాహకుడు బెల్లపు శ్రీనును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ మేరకు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో సీఐ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. గంట్యాడ మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన శ్రీను సెలూన్‌ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. షాపునకు కటింగ్‌కు వచ్చే కష్టమర్లను మాటల్లో పెట్టి మెడలో ఉన్న చైన్లను దొంగిలించేవాడు. బాంగారం చైన్లు ఎక్కడ పోయిందో తెలుసుకోలేని కస్టమర్లు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడేవారు. నగరానికి చెందిన ఇమంది బైరాగి, శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో శ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరాన్ని అంగీక రించినట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. ఈ కేసులో క్రియాశీలంగా వ్యవహరించిన ఎస్‌ఐ అశోక్‌కుమార్‌, హెచ్‌సీ అచ్చిరాజు, పీసీ శ్రీనివాసరావును సీఐ వెంకట్రావు అభినందించారు.

Updated Date - 2022-12-13T23:55:52+05:30 IST

Read more