ఘనంగా శ్రీరామ పట్టాభిషేకోత్సవం

ABN , First Publish Date - 2022-12-15T00:12:21+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణోత్సవం, పట్టాభిషేకం ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా శ్రీరామ పట్టాభిషేకోత్సవం
స్వామివారి పట్టాభిషేకాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

- 30 మంది రుత్వికులతో పారాయణ

నెల్లిమర్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణోత్సవం, పట్టాభిషేకం ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కొత్తవలసకు చెందిన భోగి సావిత్రమ్మ రాసిన రామకోటి పుస్తకాలు సమర్పించే క్ర మంలో భగవత్‌ రామానుజాచార్యులు దాస బృందం (విజయనగరం) కన్వీనర్‌ రాజగోపాలాచార్యులు (రాజా) ఆఽధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సింహాచలం, విజయనగరం ప్రాంతాలకు చెందిన 30 మంది రుత్వికులతో రామా యణం, భగవద్గీత, విష్ణుపురాణం, స్తోత్ర పారాయణం నిర్వహించారు. విజయనగరానికి చెందిన భగవతి నృత్య కళామండలికి చెందిన చిన్నారులు మత్స నాచ్ని, టోంపల ఊహ నృత ప్రదర్శన ఆకట్టుకుంది. విజయనగరానికి చెందిన బెహర్లాత, శివకుమార్‌, ఈశ్వరమ్మ ఈ కార్యక్రమానికి వాయిద్య సహకారం అందించారు. దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, స్థానాచార్యులు గొడవర్తి నర సింహాచార్యులు, అర్చకులు ఖండవిల్లి కిరణ్‌, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:12:22+05:30 IST