భర్తపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-07-19T05:44:59+05:30 IST

తన భర్త గృహ నిర్భందం, వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ భార్య సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడుకు ఫిర్యాదు చేసింది.

భర్తపై ఫిర్యాదు

గరుగుబిల్లి: తన భర్త గృహ నిర్భందం, వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ భార్య సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడుకు ఫిర్యాదు చేసింది. మరుపెంట మధుర సాంబన్నవలస గ్రామానికి చెందిన లక్ష్మీపతుల స్వాతి తల్లిదండ్రులతో కలిసి తమ సమస్యలను వివరించింది. వారు పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా సుద్దపల్లి డొంకలో ఉంటున్న లక్ష్మీపతుల ప్రసాద్‌తో ఐదేళ్ల కిందట స్వాతికి వివాహమ య్యింది. ప్రసాద్‌ ఒడిశాలోని టాటానగర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. నాలుగేళ్లుగా భార్యాభర్తలు ఇద్దరూ అక్కడే ఉండేవారు. అత్త జయలక్ష్మి, చిన్నత్త చిన్నమ్మలు, మరిది నాగేంద్ర తమ ఇంటికి వచ్చి 2021 సంవత్సరం మార్చి నెల నుంచి అదనం గా కట్నం, భూమి తీసుకు రావాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారని స్వాతి తెలిపారు. తన దగ్గర ఉన్న ఫోన్‌ను లాక్కొని, ఇంటిలోనే బంధించారని ఆమె  చెప్పారు. తన భర్త తన తల్లిని గుంటూరు పంపించి, తనను, పిల్లలను వాళ్ల తమ్ముడి ఇంట్లో వదిలి గుజరాత్‌ వెళ్లిపోయాడని ఆమె చెప్పింది.  నెల రోజులుగా ఎదురు చూసినా, ఎప్పటికీ రాకపోవడంతో పిల్లలతో కన్నవారి ఇంటికి వచ్చేశానని తెలిపింది. వివాహం చేసిన పెద్దలకు తమ సమస్యను తెలియపర్చినా స్పందన లేదన్నారు. ఆఖరుకు విసుగుచెంది భర్తపై ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. తన కు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. తన పిల్లలైన సాహి తి, జతేష్‌లకు న్యాయం చేయాలని ఆమె కోరారు. 

 

Updated Date - 2022-07-19T05:44:59+05:30 IST