భార్య, కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-12-15T00:20:38+05:30 IST
పెదగుడబ పంచాయతీ సన్యాసిరాజుపేట గ్రామానికి చెందిన ముంతల తిరుపతిరావు తన భార్య వెంకటలక్ష్మి, చిన్న కుమార్తె భవ్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్టు బుధవారం ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపారు.
గరుగుబిల్లి: పెదగుడబ పంచాయతీ సన్యాసిరాజుపేట గ్రామానికి చెందిన ముంతల తిరుపతిరావు తన భార్య వెంకటలక్ష్మి, చిన్న కుమార్తె భవ్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్టు బుధవారం ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. గత నెల 28న కన్నవారి గ్రామమైన గెడ్డతిరువాడ గ్రామానికి చిన్న కుమార్తెతో కలిసి బయలుదేరి వెళ్లింది. అయితే ఆ గ్రామానికి వారు వెళ్లలేదు. దీంతో వారి ఆచూకీ కోసం తిరుపతిరావు వెతికినా ఫలితం లేదన్నారు. దీంతో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. వీరి ఆచూకీ తెలిసినవారు 91211 09469 ఫోన్ నెంబరుకు సమాచారం అందించాలని కోరారు.