కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌

ABN , First Publish Date - 2022-12-15T23:44:25+05:30 IST

పశువుల సంతలను నిర్వహిం చవద్దన్న కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ రాజాంలో యథావిధిగా నిర్వహిస్తుం డడంపై జంతు సంక్షేమ కమిటీ సభ్యులు రామకృష్ణ, సత్యనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు.

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌

రాజాం రూరల్‌: పశువుల సంతలను నిర్వహిం చవద్దన్న కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ రాజాంలో యథావిధిగా నిర్వహిస్తుం డడంపై జంతు సంక్షేమ కమిటీ సభ్యులు రామకృష్ణ, సత్యనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు రాజాంలో సంత నిర్వహిస్తున్న ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ లంపి స్కిన్‌ వైరస్‌ ప్రబలుతున్న నేపఽథ్యంలో సంతల నిర్వహణను నిషే ధించినా రాజాంలో మాత్రం కొందరు వ్యాపారులు పశువుల క్రయ విక్రయాలతోపాటు లావేదేవీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గతం లో పట్టణానికి దూరంగా నిర్వహించేవారని, ప్రస్తుతం నగర నడిబొ డ్డునే సంత నిర్వహిస్తున్నారని చెప్పారు. నిర్వాహకులతో కమిషనర్‌ కుమ్మక్కయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఈ విషయం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-12-15T23:44:27+05:30 IST